-
-
Home » Telangana » Rangareddy » KCR is the eldest son of poor mothers-MRGS-Telangana
-
పేదింటి తల్లులకు పెద్దకొడుకు కేసీఆర్
ABN , First Publish Date - 2022-09-09T05:23:17+05:30 IST
పేదింటి తల్లులకు పెద్దకొడుకు కేసీఆర్

మంచాల/ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 8: పేదింటి తల్లులకు సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు లాంటి వాడని, ఆసరా ఫించన్లతో పెద్దల ఆత్మగౌరవం పెంపొందుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొనియాడారు. స్థానిక షర్పంజీ గార్డెన్స్‌లో గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 1540 మంది లబ్ధిదారులకు ఆసరాఫించన్లు, 42మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్నర్మదలచ్చిరాం, జడ్పీటీసీ మర్రినిత్యనిరంజన్రెడ్డి, వైస్‌ఎంపీపీ రాజేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, సర్పంచులు జగన్‌రెడ్డి, కిషన్‌నాయక్, శ్రీనివా్‌సరెడ్డి, రాజూనాయక్, జంగయ్యయాదవ్, నౌహీద్‌బేగం, ఎన్.హరిప్రసాద్, కొంగరవిష్ణువర్దన్‌రెడ్డి, పాండు, ఎంపీటీసీలు చీరాలరమేష్, కావలిశ్రీనివాస్, కాట్రోత్పరంగా, జయానందం, పి.సుకన్య, ఎల్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం, నెర్రెపల్ల్లి గ్రామాల్లో ఎంపీపీ కృపేష్ పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు. దండుమైలారం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు జడ్పీ నిధుల నుంచి రూ.6లక్షలు, నెర్రెపల్లి పాఠశాలకు రూ.2లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దండుమైలారం, నెర్రెపల్లి సర్పంచులు రావణమోని మల్లీశ్వరి, నిమ్మల భాస్కర్‌గౌడ్, ఎంపీటీసీ అనసూయ, సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘పార్టీలకు అతీతంగా పింఛన్ల పంపిణీ’
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: గ్రామాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడ, గుండాల, పామెన, చనువల్లి గ్రామాల్లో గురువారం నూతనంగా 1717 మంది లబ్ధిదారులకు, మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే గురువారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు ఎం.విజయలక్ష్మి, నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచులు ఎం.మోహన్‌రెడ్డి, ప్రణతి, మాల్లారెడ్డి, రాధిక, ఎర్ర మల్లేశ్‌యాదవ్, ప్రభాకర్, రవీందర్, సీనియర్ నాయకులు ఉన్నారు.