-
-
Home » Telangana » Rangareddy » KCR at MLA Anand house-NGTS-Telangana
-
ఎమ్మెల్యే ఆనంద్ ఇంటికి కేసీఆర్
ABN , First Publish Date - 2022-08-17T05:48:49+05:30 IST
ఎమ్మెల్యే ఆనంద్ ఇంటికి కేసీఆర్

- అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిని పలకరించిన సీఎం
- ప్రగతి భవన్‌కు రావాలంటూ ఆహ్వానం
వికారాబాద్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో హెలీక్యాప్టర్ దిగిన తరువాత కేసీఆర్ నేరుగా ఎమ్మెల్యే ఆనంద్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఎమ్మెల్యే దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సీఎంకు కేసీఆర్-శోభ దంపతుల చిత్రపటాన్ని (కాన్వా్సను) జ్ఞాపికగా అందజేశారు. అక్కడే ఉన్న పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డిని ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్.. ‘మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అని ఆరా తీశారు. ఓసారి ప్రగతిభవన్‌కు రావాలంటూ సీఎం హారీశ్వర్రెడ్డిని ఆహ్వానించారు.