నిధులు కావాలంటే టీఆర్‌ఎ్‌సలో చేరాలా?

ABN , First Publish Date - 2022-03-04T05:32:59+05:30 IST

నిధులు కావాలంటే టీఆర్‌ఎ్‌సలో చేరాలా?

నిధులు కావాలంటే టీఆర్‌ఎ్‌సలో చేరాలా?
నాగారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు

కీసర రూరల్‌, మార్చి 3: ‘నిధుల కేటాయింపుల్లో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులపై వివక్ష చూపటం సరికాదని, ప్రభుత్వ నిధులు కావాలంటే అందరూ టీఆర్‌ఎ్‌సలో చేరాలా?’ అని మేడ్చల్‌ జడ్పీ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ సింగి రెడ్డి హరివర్దన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం నాగారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహి ంచారు. కేటాయింపుల్లో కాంగ్రెస్‌ పార్టీ వార్డులను చేర్చకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించారు. పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. జడ్పీటీసీ హరివర్దన్‌రెడ్డి మ ద్దతు తెలిపి మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపుల్లో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకే ప్రా ధాన్యం ఇస్తూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లను లెక్కల్లోకి తీసుకోకపోవటం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సీడీఎంఏ నుంచి మంజూరైన నిధులను అన్ని వార్డులకు కేటాయించాలన్న కాంగ్రెస్‌ మహిళా కౌన్సిలర్‌ను టీఆర్‌ఎ్‌సలో చేరాలంటూ హేలన చేయటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే మున్సి పాలిటీల్లో పార్టీల పరంగా నిధులు కేటాయించటమేంటని ప్రశ్నించారు. అన్ని పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుల్లోనూ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని, అభివృద్ధి అంతటా సమానంగా చేయాల న్నారు. ఎవరూ తమ సొంత డబ్బు వెచ్చించడం లేదన్నారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత చైర్మన్‌, కమిషనర్లపై ఉందన్నారు. నాయకుల బైఠాయింపుతో పోలీసుల వచ్చి వారిని పంపించే యత్నం చేశారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లకు నిధులు ఎందుకు కేటాయించలేదో కమిషనర్‌ చెప్పాలని పట్టుబట్టారు. చివరకు పోలీసులు హరివర్ధన్‌రెడ్డి ని, నాయకులను స్టేషన్‌కు తరలించారు. ఆందోళ నలో కౌన్సిలర్లు సీహెచ్‌.సరిత, ఆర్‌.ప్రియాంక, పి. హరిబాబు, నాయకులు ఎం.శ్రీనివా్‌సరెడ్డి, పద్మ, రమేష్‌, చక్రపాణిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T05:32:59+05:30 IST