జినుగుర్తి-తట్టేపల్లి రోడ్డు పనులు షురూ

ABN , First Publish Date - 2022-12-12T00:11:18+05:30 IST

రూ.23కోట్లతో నిర్మిస్తున్న జినుగుర్తి-తట్టేపల్లి బీటీ రోడ్డు పనులను బీఆర్‌ఎస్‌ పార్టీ తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు.

జినుగుర్తి-తట్టేపల్లి రోడ్డు పనులు షురూ
జినుగుర్తి-తట్టేపల్లి రోడ్డు పనులను పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

తాండూరు రూరల్‌, డిసెంబరు 11: రూ.23కోట్లతో నిర్మిస్తున్న జినుగుర్తి-తట్టేపల్లి బీటీ రోడ్డు పనులను బీఆర్‌ఎస్‌ పార్టీ తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. సీనియర్‌ నాయకులు ఉమాశంకర్‌, రాంలింగారెడ్డితో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 20ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్డు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చొరవతో నాణ్యమైన రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్ర మంలో గౌతాపూర్‌ ఎంపీటీసీ సాయిరెడ్డి, జనరల్‌ సెక్రెటరీ రాకేష్‌, మండల బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, ఉపసర్పంచ్‌ రాథోడ్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-12-12T00:11:18+05:30 IST

Read more