కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జయమ్మ

ABN , First Publish Date - 2022-06-08T05:16:58+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జయమ్మ

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జయమ్మ

మంచాల, జూన్‌ 7: కాంగ్రెస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మండలంలోని ఎల్లమ్మతండాకు చెందిన గుండెమోని జయమ్మ నియమితులయ్యారు. ఈమేరకు ఆపార్టీ మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఫాతిమా, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావులు ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా గుండెమోని జయమ్మ గత పర్యాయం మంచాల ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త గుండెమోని మల్లేష్‌ ఎల్లమ్మతండా సర్పంచ్‌గా, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

Read more