మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభం

మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభం

పెద్దేముల్‌/కులకచర్ల, జూలై 3 : గొట్లపల్లి మొడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్‌ గాయత్రి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులకు గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా కులకచర్ల మండలం ముజాహిత్‌పూర్‌లోని ఆదర్శ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 7 వరకు విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read more