వైభవంగా సేవాలాల్‌, మరియమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2022-11-30T00:15:01+05:30 IST

మండలంలోని జీవన్గి బర్కాల ఆలయంలో సేవాలాల్‌, మరియమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం కనుల పండువగా సాగింది.

వైభవంగా సేవాలాల్‌, మరియమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన
బషీరాబాద్‌ : సేవాలాల్‌, మరియమ్మలను దర్శించుకున్న నాయకులు, తదితరులు

బషీరాబాద్‌, నవంబరు 29: మండలంలోని జీవన్గి బర్కాల ఆలయంలో సేవాలాల్‌, మరియమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం కనుల పండువగా సాగింది. అర్చకులు వేదమంత్రాల సాక్షిగా వేకువజామున స్థాపిత దేతల హోమం, యంత్ర స్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత నియమ నిష్టలతో విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూజారి రాఘవేంద్రచారి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ వస్త్రధారణతో ముస్తాబై ఆలయం వద్ద నృత్యాలు చేశారు. కాగా, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆలయ కమిటీ తరపున స్థానికుడు, ఏఎంసీ డైరెక్టర్‌ పాండురంగా ఆధ్వర్యంలో నిర్వాహకులు ఎమ్మెల్యే, ముఖ్యతిఽథులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సర్పంచ్‌ కోటపు నవనీత, ఎంపీటీసీ పుర్మా సునీత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామునాయక్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇందర్‌చెడ్‌ నర్సిరెడ్డి, వీరారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఉత్తంచంద్‌, ధరసింగ్‌, జనార్ధన్‌నెడిత్డ, కలాల్‌ నర్సింహులు, బతుల వెంకట్‌ తదితరులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. స్థానికులు, పరిసర ప్రాంత గిరిజనులు పెద్దసంఖ్యలో హజరయ్యారు.

అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టిపూజ

వికారాబాద్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌ : వల్లిదేవ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజ కార్యక్రమాన్ని వికారాబాద్‌ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి పాలు, తేనె, నెయ్యితో అభిషేకం చేశారు. అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ మండల పరిధి ప్రతా్‌పసింగారంలో మంగళవారం సాయంత్రం శ్రీ సుబ్రమణ్య స్వామి షష్ఠి (జయంతి)కార్యక్రమం ఘనంగా జరిగింది. అయ్యప్పస్వాములు గ్రామంలోని శ్రీ భవాని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం నుంచి 200 లీటర్ల ఆవు పాలతో శ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి స్వామికి సమర్పించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ మాలదారులు భక్తి పారవశంలో ముగినితేలారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వంగూరి శివశంకర్‌, ఆలయకమిటీ చైర్మన్‌ సాయినాధ్‌గౌడ్‌, అలయ పూజారి నాగరాజు వీరమల్లు, సన్నిదానం పూజారి నవీన్‌గౌడ్‌, అయ్యప్ప మాలదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొన్న వైస్‌ చైర్‌పర్సన్‌

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో మంగళవారం మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి తాండూరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు హాజరై స్వామివారిని దర్శిఽంచుకున్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, మాలాధారణ స్వాములు దర్శించుకున్నారు.

Updated Date - 2022-11-30T00:15:02+05:30 IST