పారిశుధ్య పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-04-06T04:35:59+05:30 IST

పారిశుధ్య పనుల పరిశీలన

పారిశుధ్య పనుల పరిశీలన

ఆమనగల్లు, ఏప్రిల్‌ 5: స్థానిక విద్యానగర్‌ కాలనీలో మంగళవారం కౌన్సిలర్‌ సోని జయరామ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. కాలనీలో అంతర్గత మురుగు కాల్వలు లేక మురికినీరు నివాసగృహాల మధ్య దోమలు, ఈగలు ముసురుతున్నాయని కాలనీ అధ్యక్షుడు ఎంఏ పాష, స్థానికులు కౌన్సిలర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కౌన్సిలర్‌ కాలనీలో పర్యటించి అంతర్గత రోడ్లపై పారుతున్న మురుగునీటిని, పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు జిల్లెల్ల సుదర్శన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకటయ్య, రాములు, మల్లేశ్‌, గిరి, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. 

Read more