ఇన్ముల్‌నర్వ క్వారీ కుంటలో కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2022-07-06T04:40:59+05:30 IST

మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ సమీపంలో

ఇన్ముల్‌నర్వ క్వారీ కుంటలో కొనసాగుతున్న గాలింపు
క్వారీ కుంటలో బోటుల ద్వారా గాలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

  • లభ్యంకాని బాలుడి ఆచూకీ

కొత్తూర్‌, జూలై 5: మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ సమీపంలో గల క్వారీ కుంటలో పడిన బాలుని కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయినా బాలుని ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదవశాత్తు క్వారీ కుంటలో పడి పాత్లావత్‌ చందు(15) గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి వరకూ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాలుని కోసం వెదికారు. సంఘటనా స్థలాన్ని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఆయన తనయుడు, కేశంపేట ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్‌ పరిశీలించారు. మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి బోట్ల సహాయంతో ఆక్సిజన్‌ మాస్కులు ధరించి గాలించారు. షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరి, కొత్తూర్‌ తహసీల్దార్‌ రాములు, ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌, సర్పంచ్‌ అజయ్‌మిట్టునాయక్‌ సంఘటన స్థలం వద్ద ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాలుని ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. Read more