ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-10-05T05:00:23+05:30 IST

మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని

ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం
దాసర్లపల్లిలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీటీసీ ఇందిరాదేవేందర్‌

మంచాల/కందుకూరు, అక్టోబరు4: మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని టీఆర్‌ఎస్‌ జిల్లా నేత ముచ్చర్ల వెంకటే్‌షయాదవ్‌ అన్నారు. ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకొని మంగళవారం మంచాల మండలం ఆరుట్లలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌, నగేష్‌, సురేష్‌, జంగయ్య, సద్దాం, నర్సింహ, శ్రీను, దానయ్య పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని దాసర్లపల్లిలో ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇందిరా దేవేందర్‌, సర్పంచ్‌ బాలమణిఅశోక్‌ పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.  Read more