-
-
Home » Telangana » Rangareddy » In the presence of Ramalingeswari Commissioner of Devadaya Department Anil-MRGS-Telangana
-
రామలింగేశ్వరుడి సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్
ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST
రామలింగేశ్వరుడి సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్

కీసర,సెప్టెంబరు10:కీసరగుట్ట ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి, అర్చకులు ఆయనకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఈమేరకు అనిల్ గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం దాత మంతెన శ్రీనివాస్ గ్రూప్ అధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. దాత శ్రీనివాస్ క్షేత్రంపై అభివృద్ధి పనులు చేపట్టడం హర్షనీయమన్నారు. పరిపాలనభవనం పూర్తి కావడంతో ఈవోసుధాకర్‌రెడ్డిని కూర్చోబెట్టిఅనిల్ శుభాకాంక్షలు తెలిపారు.