అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ABN , First Publish Date - 2022-12-13T00:01:03+05:30 IST

తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
జూనియర్‌ కళాశాలలో ధర్నా చేస్తున్న విద్యార్థులు

పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి ఆవేదన

తాండూరు, డిసెంబరు 12: తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తరగతి గదుల్లో సిగరెట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కవర్లు, మూత్రవిసర్జన చేసి కంపు చేశారని విద్యార్థులు పీడీఎ్‌సయూ నాయకులకు తెలిపారు. తరగుతులు బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేశారు. దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్ని సమస్యలున్నా ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాలేజీలో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు.కార్యక్రమంలో నాయకులు షోయబ్‌, ప్రకాష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

జూనియర్‌ కళాశాలను సందర్శించిన కౌన్సిలర్‌

తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను స్థానిక కౌన్సిలర్‌ విజయాదేవి, తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. సోమవారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో మాట్లాడారు. కళాశాల గదులు, మైదానాన్ని పరిశీలించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్వీ ఇన్‌చార్జీ జిలాని, స్టేషన్‌ హనుమాన్‌ ఆలయ చైర్మన్‌ సంజీవరావు, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - 2022-12-13T00:01:03+05:30 IST

Read more