ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్త సర్వే

ABN , First Publish Date - 2022-01-24T05:14:59+05:30 IST

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్త సర్వే

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్త సర్వే
తాండూరులో సర్వే నిర్వహిస్తున్న ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎస్‌ల అధికారులు

తాండూరు, జనవరి 23: ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్స్‌ రీసెర్చ్‌, జాతీయ పోషకాహార సంస్థలు సంయుక్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై సర్వే చేపట్టాయి. వికారాబాద్‌ జిల్లాలో సర్వేను ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రజల రక్త నమూనాలను సేకరించి జిల్లాలో కొవిడ్‌ ఎంతమేరకు వ్యాప్తి చెందుతోందో గుర్తిస్తున్నారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో  చేపట్టిన సర్వే ఆదివారం తాండూరు మున్సిపాలిటీ 4వ వార్డులో చేపట్టారు. జిల్లాలో నజకన్‌పల్లి, నాగ్‌సన్‌పల్లి, ఈర్లపల్లి, షాఖాపూర్‌, బూర్గంపల్లి, పీరంపల్లి తదితర ఎంపిక చేసిన గ్రామాల్లో రక్తనమానాలు సేకరిస్తున్నారు. ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటే్‌ష, బృందం సభ్యులు 40 అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతంలో వైద్యాధికారులు, మున్సిపల్‌, గ్రామ పంచాయతీల సహకారంతో 50మంది నుంచి రక్త నమూనాలను సే కరిస్తున్నారు. పరీక్షల అనంతరం తగిన నివారణ చర్యలు చేపట్టాడానికి వీలవుతుందని బృందం సభ్యులు పేర్కొన్నారు. తాండూరు మున్సిపాలిటీలో రెండో రోజు ఆదివారం ఈ రక్తనమూనాల సేకరణ కొనసాగింది.

Read more