భార్యతో అక్రమ సంబంధం ఉందని.. వ్యక్తిపై భర్త దాడి

ABN , First Publish Date - 2022-09-08T05:40:04+05:30 IST

భార్యతో అక్రమ సంబంధం ఉందని.. వ్యక్తిపై భర్త దాడి

భార్యతో అక్రమ సంబంధం ఉందని.. వ్యక్తిపై భర్త దాడి

 దోమ, సెప్టెంబరు 7: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో కత్తితో దాడి చేసిన భర్తతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన అప్పగళ్ల వెంకటయ్య భార్యతో అదే గ్రామానికి చెందిన మల్కపురం నర్సింహులు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఆదివారం రాత్రి ఆ మహిళ భర్త వెంకటయ్య.. కత్తితో నర్సింహులుపై దాడి చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నర్సింహులును చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్రమ సంబంధం విషయంలో వ్యక్తిపై దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింహులు భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు బుధవారం వెంకటయ్యతో పాటు దాడికి సహకరించిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దోమ ఎస్‌ఐ విశ్వజన్‌ తెలిపారు.


Read more