భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2022-02-20T05:11:19+05:30 IST

భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

తాండూరు రూరల్‌, ఫిబ్రవరి 19 : భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన బుడగజంగం మహేష్‌ భార్య సునీతను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అక్క అనిత ఫిర్యాదు మేరకు శుక్రవారం మహేష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం తాండూరు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచినట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదనచారి తెలిపారు.

Read more