మైసిగండి ఆలయ హుండీ రూ.10.49లక్షలు

ABN , First Publish Date - 2022-12-30T23:59:46+05:30 IST

మైసిగండి మైసమ్మ ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు.

మైసిగండి ఆలయ హుండీ రూ.10.49లక్షలు
హుండీని లెక్కిస్తున్న ట్రస్టీ, ఈవో, సిబ్బంది

కడ్తాల్‌, డిసెంబరు 30: మైసిగండి మైసమ్మ ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రణిత్‌కుమార్‌ సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 57రోజులకు రూ.10,48,852 ఆదాయం వచ్చినట్లు ఈవో చెప్పారు. హుండీ ఆదాయాన్ని ఆలయ బ్యాంక్‌ ఖాతాలో వేసి అభివృద్ధి, భక్తుల సదుపాయాల కల్పనకు వెచ్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీ భాస్కర్‌, అరుణ్‌, యాదగిరి, బోడ్యనాయక్‌, కృష్ణ, చంద్ర య్య, రాములు, దేవేందర్‌, రమాదేవి, శ్రీనివాసులు, పత్యనాయక్‌, వెంకటేశ్‌, కృష్ణయ్య, బీబీ చారి, శ్రీను, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:59:46+05:30 IST

Read more