మరుగుదొడ్డి ఇలా.. వెళ్లేదెలా?

ABN , First Publish Date - 2022-08-31T06:05:48+05:30 IST

మరుగుదొడ్డి ఇలా.. వెళ్లేదెలా?

మరుగుదొడ్డి ఇలా.. వెళ్లేదెలా?
పొదల్లో కూరుకుపోయిన ఇందర్‌చెడ్‌ అంగన్‌వాడీ కేంద్ర మరుగుదొడ్డి

బషీరాబాద్‌, ఆగస్టు 30:  ఇందర్‌చెడ్‌ గ్రామంలో అంగన్‌వాడీ కేం ద్రం వద్ద మరగుదొడ్డిని నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. ఏళ్ల తరబడి మరుగుదొడ్డి నిరుపయోగంగా మారడంతో చిన్నారులకు క ష్టాలు తప్పడం లేదు. దీంతో రోజూ టీచర్‌, ఆయా చిన్నారులను రోడ్డు దిక్కు బాత్‌రూంకు తీసుకె ళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇ క్కడ మరుగుదొడ్డి నిర్మించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా వృఽథాగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని మురుగుదొడ్డి ని వినియోగించుకునేలా మరమ్మతులు చేయించాలని చిన్నారుల తల్లిదండ్రులు  కోరుతున్నారు. 

Read more