బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-09-10T05:58:35+05:30 IST

బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు సన్మానం

బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు సన్మానం
తహసీల్దార్‌ మరళీకృష్ణను సన్మానిస్తున్న ఎంపీపీ, జడ్పీటీసీ

కేశంపేట, సెప్టెంబరు 9: కేశంపేట తహసీల్దార్‌గా విధులు నిర్వహించి బదిలీపై కడ్తాల్‌ మండల తహసీల్దార్‌గా వెళ్లిన మురళీకృష్ణను శుక్రవారం నాయకులు సన్మానించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో కేశంపేట ఎంపీపీ ఎల్గనమోని రవీందర్‌ యాదవ్‌, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డిలు మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. ఆయన సేవలు అభినందనీయమన్నారు. 

కందుకూరు తహసీల్దార్‌గా మహేందర్‌రెడ్డి 

కందుకూరు, సెప్టెంబరు 9: కందుకూరు తహసీల్దార్‌గా మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ రెండు సంవత్సరాలుగా తహసీల్దార్‌గా పనిచేసిన ఎస్‌.జ్యోతి బదిలీపై వెళ్లడంతో కడ్తాల మండలం నుంచి బదిలీపై వచ్చిన మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 

Read more