-
-
Home » Telangana » Rangareddy » Heavy seizure of gold at the airport-MRGS-Telangana
-
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-09-18T05:16:06+05:30 IST
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 17: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి రెండు విమానాల్లో శనివారం ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఇద్దరి వద్ద బ్రీఫ్‌కేసులో 1.27కిలోల బంగారు ఆభరణాలను, మరో ప్రయాణికుడు ద్రవ రూపంలో తెచ్చిన 498గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.