వికారాబాద్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T05:26:31+05:30 IST

వికారాబాద్‌లో భారీ వర్షం

వికారాబాద్‌లో భారీ వర్షం
వికారాబాద్‌ వర్షం కురవడంతో ప్రయాణికుల ఇబ్బందులు

వికారాబాద్‌/ధారూరు,సెప్టెంబరు 28: వికారాబాద్‌ పట్టణంలో బుధవారం సాయంత్రం నుంచి  రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని పలు ప్రధానరోడ్లు కాలనీల్లో వరద నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  

పిడుగుపడి నలుగురికి  గాయాలు

 కాగా ధారూరు మండల పరిధిలోని కేరెల్లి గ్రామ శివారులోని పొలంలో పిడుగుపడి నలుగురికి గాయాలైనాయి. ఽగ్రామానికి చెందిన అనంతయ్య, లక్ష్మి, వెంకటమ్మ, సావిత్రమ్మ, ప్రవీణ్‌కుమార్‌లలో కలిసి పొలం పనులు చేస్తుండగా సాయంత్రం వర్షం కురవడంంతో ఒకచోట నిలబడ్డారు. వారి సమీపంలో పిడుగు పడడంతో వారు అపస్మారకస్థితిలోకి వెళ్లగా స్థానికులు వికారాబాద్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న  క్షతగాత్రులు ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పరామర్శించారు.  వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్య సిబ్బందిని అదేశించారు.

Read more