సమాజసేవతోనే సంతోషం

ABN , First Publish Date - 2022-09-12T05:18:05+05:30 IST

సమాజ సేవతో సంతోషం దక్కుతుందని

సమాజసేవతోనే సంతోషం
శ్మశానవాటికను ప్రారంభిస్తున్న మంత్రి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 

మహేశ్వరం, సెప్టెంబరు 11 : సమాజ సేవతో సంతోషం దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కీర్తి శేషులు శ్రీనివా్‌సగౌడ్‌ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబసభ్యులు తుక్కుగూడలో ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను ఆదివారం ఆమె ప్రారంభించారు. పుట్టిన ఊరుకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తుక్కుగూడలో కీర్తి శేషులు శ్రీనివా్‌సగౌడ్‌ గతంలో చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివా్‌సగౌడ్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. Read more