ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-13T05:23:40+05:30 IST

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 12: కుటుంబ గొడవలతో ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్‌కు చెందిన లింగాల లక్ష్మయ్య(41)కు భార్య అనిత, ఇద్దరు కుమారులున్నారు. గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన లక్ష్మయ్య రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. బుధవారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం పొల్కంపల్లి పరిధి జనహర్ష ఫాం ల్యాండ్స్‌ క్యూ ఫేజ్‌లో చెట్టుకు ఉరేసుకున్న లక్ష్మయ్యను గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు.

Read more