గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండడం గర్వకారణం

ABN , First Publish Date - 2022-09-26T05:10:35+05:30 IST

గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండడం గర్వకారణం

గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండడం గర్వకారణం
ప్రారంభ వేడుకల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

  • వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ 
  • అట్టహాసంగా జోనల్‌ స్థాయి క్రీడలు ప్రారంభం

వికారాబాద్‌, సెప్టెంబరు 25: ఏ రంగంలో చూసినా గురుకుల విద్యార్థులు ముందంజలో ఉండటం గర్వకారణం అని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ సంక్షేమ గురుకుల బాలుర జోనల్‌ స్థా యి క్రీడలు అనంతగిరిపల్లి బాలుర పాఠశాలలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడు దేశాల విదేశీ,  18 రాష్ట్రాల ప్రతినిధులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రగతిని చూసేందుకు రావడం హర్షణీయమన్నారు. పోరాడితే విజయం తప్పక లభిస్తుందని, పరాజయం కూడా విజయానికి తొలి మెట్టుగా భావించాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. రంగారెడ్డి-హైదరాబాద్‌ ప్రాంతీయ సమన్వయ అధికారి శారదవెంకటేశ్‌ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడారంగంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం మనదేనని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి పద్మావతి, ప్రిన్సిపాల్‌ జజే ప్రవీణ్‌కుమార్‌, ఏఆర్‌సీవో శ్రీనివా్‌సరెడ్డి, డీసీవో అపర్ణ, క్రీడల జోనల్‌ ఆఫీసర్‌ ఉదయభాస్కర్‌, పీడీ చందర్‌, స్థానిక కౌన్సిలర్‌ శ్రీదేవి, కౌన్సిలర్లు లంక పుష్పలతారెడ్డి, అనంతరెడ్డి, కృష్ణ, రమణ, మాజీ కౌన్సిలర్‌ ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్‌, వెంకట్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.Read more