ఘనంగా గంపజాతర

ABN , First Publish Date - 2022-08-21T06:00:51+05:30 IST

ఘనంగా గంపజాతర

ఘనంగా గంపజాతర
చేవెళ్లలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఊరేగింపు

చేవెళ్ల, ఆగస్టు 20: శ్రావణ శనివారం సందర్భంగా చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గంప జాతరను ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని అర్చకులు ప్రత్యేకంగా ఆలకంరించారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సమీప గ్రామల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలువురు భక్తులు ఆలయంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి వరకు లక్ష్మీవేంకటేశ్వరస్వామికి భక్తులు ఊరేగింపు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవి ంద నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్‌, ప్రధాన అర్చకులు వామానచార్యులు, వాసుదేవచార్యులు, శ్రీకాంత్‌, శ్రీపాద్‌, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read more