ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-18T05:13:12+05:30 IST

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న మంత్రి సబితారెడ్డి, అధికారులు

  • కలెక్టరేట్‌ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి
  • కార్యాలయాల వద్ద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాకు వందనాలు

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ వద్ద విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదట ఆమెకు అశ్వదళం ఘనస్వాగతం పలికింది. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, దనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్‌జైన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీఆర్వో హరిప్రియ, ఆర్డీవో వెంకటచారి, ఏవో ప్రమీల, ఉద్యోగులు పాల్గొన్నారు.


  • జిల్లా వ్యాప్తంగా సమైక్యతా దినోత్సవం

చేవెళ్ల/ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్‌ అర్బన్‌/రంగారెడ్డి అర్బన్‌/కందుకూరు/కొత్తూర్‌/యాచారం/షాబాద్‌/మహేశ్వరం/నందిగామ, కేశంపేట, కొందర్గు, చౌదరిగూడ, సెప్టెంబరు 17: చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకోవడం మన కర్త వ్యం అన్నారు. నిజాం నిరంకుశ పాలకు చరమగీతం పాడి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందన్నారు. ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, జడ్పీటీసీ ఎం.మాలతి, వైఎ్‌సఎంపీపీ శివప్రసాద్‌, నాయకులు ప్రభాకర్‌, మిట్ట రంగారెడ్డి. ఆర్డీవో వేణుమాధవరావు, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివా స్‌ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంపీపీ కృపేష్‌, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, రమే్‌షగౌడ్‌, బుగ్గ రాములు, చీరాల రమేష్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌లోని ఆర్డీవో, ఏసీపీ, తహసీల్దార్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాలపై జాతీయ జెండాలను నాయకులు, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, ఎంపీపీ ఇద్రిస్‌, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి, ఆర్డీవో రాజేశ్వరి, ఏసీపీ కుషాల్కర్‌, తహసీల్దార్‌ గోపాల్‌, ఎంపీడీవో వినయ్‌కుమార్‌ పాల్గొన్నా రు. జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైస్‌ చైర్మన్‌ గణేష్‌, శంషాబాద్‌ జడ్పీటీసీలు తన్వీరాజ్‌, టి.విశాల, జంగమ్మ, శ్రీకాంత్‌, అవినా్‌షరెడ్డి, జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌, డిప్యూటీ సీఈవో రంగారావు, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు సురే్‌షచంద్రారెడ్డి పాల్గొన్నారు. కందుకూరులో ఆర్డీవో వెంకటాచారి, ఎంపీడీవో వెం కట్రాములు, తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించారు. జడ్పీటీసీ జంగారెడ్డి, మహేశ్వరం ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, డీఏవో ఆర్పీ.జ్యో తి, డిప్యుటీ తహసీల్దార్‌ బి.సుదర్శన్‌రెడ్డి, సిబ్బంది, ప్రజాస్రతినిఽధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూర్‌ మండలంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలి రవీందర్‌, కమిషనర్‌ వీరేందర్‌ పాల్గొన్నారు. యాచారంలో కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ కొప్పు సుకన్య, తహసీల్దార్‌ సుచరిత, ఏవో సందీ్‌పకుమార్‌, సీఐ లింగయ్య, అనిమల్‌ హస్బెండరీ ఏడీ డాక్టర్‌ వనజకుమారి, వైద్యాధికారి జయంత్‌, ట్రాన్స్‌కో ఏఈ సందీ్‌పకుమార్‌ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. షాబాద్‌ మండలం 41 గ్రామ పంచాయతీల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పా ఠశాలల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు తుక్కుగూడ ము న్సిపాలిటీలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భం గా జాతీయ జెండాలు ఆవిష్కరించారు. నందిగామ, కేశంపేట, కొందర్గు, చౌదరిగూడ, మండల కేంద్రాలు, గ్రామాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు.

Read more