ఘనంగా కార్తీక వనభోజనోత్సవం

ABN , First Publish Date - 2022-11-21T00:04:06+05:30 IST

షాద్‌నగర్‌ రెడ్డి సేవా సమితుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కార్తీక వనభోజనోత్సవం
ఉసిరిచెట్టుకు పూజ చేస్తున్న రెడ్డి మహిళా సంఘం సభ్యులు

షాద్‌నగర్‌అర్బన్‌/నందిగామ, నవంబరు 20: షాద్‌నగర్‌ రెడ్డి సేవా సమితుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందిగామలోని మొదల్లగూడ గ్రామ శివారులోని నాగరకుంట నవీన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని రెడ్డి సేవా సమితి, మహిళా సేవా సమితి, యువజన సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేశారు. అదేవిధంగా మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు అరుంధతిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌చేసి ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు దాండియా ఆడిపాడారు. రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కొప్పుల మదన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్‌ నాగరకుంట నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి సేవా సమితి భవన నిర్మాణానికి మరో రూ.2లక్షలను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా ఏటా రెడ్డి సేవా సమితికి, మహిళా సేవా సమితికి రూ.50వేల చొప్పున విరాళంగా ఇస్తూ ప్రతి కార్యక్రమానికి భోజన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కంకంటి మంజులారెడ్డి, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డి, నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ రమాదేవిరెడ్డి, బి.జగన్‌మోహన్‌ రెడ్డి, జి.రవీందర్‌రెడ్డి, ఎం.నర్సింహారెడ్డి, జి.వసంతారెడ్డి, స్వాతిరెడ్డి, లక్ష్మీరెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, జి.శ్రీనివా్‌సరెడ్డి, తిరుపతిరెడ్డి, శీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:04:06+05:30 IST

Read more