ఘనంగా సత్యసాయిబాబా జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-11-23T23:51:36+05:30 IST

సత్య సాయిబాబా 97వ జ యంతిని బుధవారం పలుచోట్ల భక్తులు ఘనంగా నిర్వహించారు

ఘనంగా సత్యసాయిబాబా జయంతి వేడుకలు
ఆమనగల్లులో సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు, సమితి సభ్యులు

ఆమనగల్లు/షాద్‌నగర్‌ అర్బన్‌/చేవెళ్ల/తలకొండపల్ల్లి, నవంబరు 23: భగవాన్‌ సత్య సాయిబాబా 97వ జ యంతిని బుధవారం పలుచోట్ల భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లులో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సాయి మందిరంలో నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, కౌన్సిలర్‌ ఝాన్సీశేఖర్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు సత్యసాయి భజనలు చేశారు. సత్యసాయి సామూహిక వ్రతాల్లో దంపతులు పాల్గొన్నారు. సత్యసాయి స్ఫూర్తితో సమాజసేవకు అంకితమవ్వాలని సేవా సమితి సభ్యులు సూచించారు.కార్యక్రమాల్లో సీఐ జె.ఉపేందర్‌, ఎస్‌ఐ సుందరయ్య, సేవాసమితి అధ్యక్షుడు దొంతు శ్రీనివాస్‌, సభ్యులు పుల్లయ్య, సంజీవ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, రామాచారి, శ్యాంసుందర్‌, రాము, ప్రభాకర్‌, సురేశ్‌, బ్రహ్మం, అల్లాజీ, శంకర్‌, శ్రీశైలం, వెంకటేశ్‌, మల్లేశ్‌, లింగం, అలివేలు,సంధ్య, సింధు, కృష్ణవేణి, విజయలక్ష్మి, తిరుపతయ్య, పెంటయ్య పాల్గొన్నారు. షాద్‌నగర్‌లోని సత్యసాయి ఆలయంలో సేవా సమితి కన్వీనర్‌ మణికొండ వెంకటయ్యగౌడ్‌ నేతృత్వంలో సంకీర్తన, సుప్రభాతం, మహిళలు వ్రతం నిర్వహించారు. బీజేపీ షాద్‌నగర్‌ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సత్య సాయిబాబా సత్యం, ధర్మం, శాంతిని ప్రబోధించి సేవలు చేశారన్నారు. సమితి సభ్యులు మాధవీలత, శ్రీనివా్‌సరెడ్డి, సుధాకర్‌రెడ్డి, దామోదర్‌, వరలక్ష్మి పాల్గొన్నారు. చేవెళ్లలో సత్యసాయిబాబా భక్తులు పల్లకీసేవ నిర్వహించారు. సాయి ఆలయంలో భజనలు చేశారు. కౌకుంట్ల హనుమాన్‌ ఆలయంలో సత్యసాయి జయంతికి భక్తులు తరలివచ్చారు. మల్లారెడ్డిగూడ సర్పంచ్‌ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగర్జున్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సేవాసమితి సభ్యులు గోపాలచారి, పెంటారెడ్డి, దివాకర్‌రెడ్డి, వెంకట్‌స్వామి, మధుసూదన్‌, నర్సింలు, మనోహర్‌రెడ్డి, రామగౌడ్‌, విఠల్‌రెడ్డి, విఠలయ్య, శంకరయ్య, ప్రభుకుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలో టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ సత్యసాయి జయంతిలో పాల్గొన్నారు. సత్య సాయిబాబా చూపినమార్గంలో మనమంతా సేవలో మందుకుసాగాలని కోరారు. విష్ణువర్దన్‌యాదవ్‌, గోపాలకృష్ణ, పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:51:36+05:30 IST

Read more