మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-09-29T05:21:15+05:30 IST

మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత

మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత
ప్రాజెక్టు నీటిలో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

పరిగి, సెప్టెంబరు 28: మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూత నిస్త్తోందని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం లక్నాపూర్‌ ప్రాజెక్టులో బుధవారం  ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను  పంపిణీ చేస్తోందన్నారు.  చేప పిల్లలే కాకుండా మత్స్య సహకార సంఘాల్లోని సభ్యులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా  ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రియ, సురేందర్‌, పిఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, సత్యనారాయణ, ఆర్‌.అంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు

Read more