అందరికీ అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

అందరికీ అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే

అందరికీ అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆలయ కమిటీ

పూడూర్‌, సెప్టెంబరు 8 : ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు సోమన్‌గుర్తి, మంచన్‌పల్లి, కంకల్‌, మన్నెగూడ తదితర గ్రామాల్లో ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందించారు. కంకల్‌కు చెందిన రైతు మేడిపల్లి నర్సిములు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందడంతో ఆయన కుటుంబానికి రైతుబీమా చెక్కును అందించారు. ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాలా ప్రభాకర్‌గుప్తా, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, నాయకులు రాంరెడ్డి, సత్యనారాయణ, ఖదీర్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

  • రాకంచర్ల ఆలయ చైర్మన్‌గా జాజుల నర్సింహ

పూడూర్‌ మండల పరిధిలోని రాకంచర్లలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్‌గా జాజుల నర్సింహ నియమితులయ్యారు. ఈమేరకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో మూడోసారి నర్సింహను ఎన్నుకున్నారు. ఈమేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీ సభ్యులతో అధికారి మధుకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.


Read more