-
-
Home » Telangana » Rangareddy » Government flats at the corporate level-MRGS-Telangana
-
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులు
ABN , First Publish Date - 2022-02-20T04:10:53+05:30 IST
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులు

మేడ్చల్, ఫిబ్రవరి19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మనఊరు - మనబడి మానికి శ్రీకారం చుట్టారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో మేడ్చల్ జిల్లాలో మనఊరు- మనబడి కింద ఎంపికైన 176 పాఠశాల్లో చేపట్టాల్సిన పనులపై జడ్పీచైర్మన్, శరత్‌చంద్రారెడ్డి, ఇన్చార్జీ కలెక్టర్ హరీ్షలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో మొదటి విడతలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్న 109 ప్రాథమిక, 6 ప్రాఽథమికోన్నత, 61 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రధానంగా పాఠశాలలకు ప్రహరీలు, ల్యాబ్‌లు, వంటగదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ విద్యా బోధనకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు హైటెక్ హంగులు కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. పాఠశాలల అభివృద్ధిలో భాగంగా ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీల సహాయంతో పనులు చేపట్టేందుకుఅవవసరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగరాజ్ యాదవ్, డీఈవో విజయకుమారి, ఎంపీపీలు, జడ్పీటీసీ, అధికారులు పాల్గొన్నారు.