ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-12-12T23:24:26+05:30 IST

దుబాయ్‌ నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
పట్టుబడిన బంగారం

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 12 : దుబాయ్‌ నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అతడి లోదుస్తుల్లో 802గ్రాముల గోల్డ్‌ ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. బంగారం విలువ దాదాపు రూ.42.5లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-12-12T23:24:26+05:30 IST

Read more