ఎయిర్‌పోర్టులో గోల్డ్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-09T05:03:44+05:30 IST

విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని

ఎయిర్‌పోర్టులో గోల్డ్‌ స్వాధీనం
పట్టుబడిన బంగారం

శంషాబాద్‌, సెప్టెంబరు 8: విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం రాత్రి కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడు షూ సాక్సుల్లో పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీ చేయగా అతని వద్ద 1,182 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీనివిలువ రూ.61,62,240 ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Read more