ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి మేక మృత్యువాత

ABN , First Publish Date - 2022-04-24T05:33:14+05:30 IST

ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి మేక మృత్యువాత

ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి మేక మృత్యువాత

దోమ, ఏప్రిల్‌ 23: మండలంలోని ఊటుపల్లి గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో ఓ మేక మృత్యు వాత పడింది. శనివారం గ్రామానికి చెందిన సుభాన్‌రెడ్డి మేకలు గ్రామ సమీ పంలో మేత మేస్తుండగా.. మినీ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి ఓ మేక అక్కడికక్కడే మృత్యు వాత పడింది. కాగా, మేక విలువ దాదాపు రూ.15 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. గ్రామ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అధికారులు కంచె ఏర్పాటు చేయకపోవడంతో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

Read more