వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ

ABN , First Publish Date - 2022-11-28T00:07:13+05:30 IST

కడ్తాల మండలం వంపుగూడ గ్రామంలో ఆదివారం అయ్యప్ప మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ
కడ్తాల: అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఆచారి, శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి

కడ్తాల్‌/తలకొండపల్ల్లి, నవంబరు 27: కడ్తాల మండలం వంపుగూడ గ్రామంలో ఆదివారం అయ్యప్ప మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గండికోట చంద్రశేఖర్‌ స్వామి ఆధ్వర్యంలో, ప్రముఖ గురు స్వామి చందర్‌ నాయర్‌ నేతృత్వంలో పూజలు చేశారు. అభిషేకాలు, గణపతి పూజ కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గండికోట శారదమ్మ సత్తయ్య, లలితచంద్రశేఖర్‌ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గురుస్వాములు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, జర్పుల దశరథ్‌ నాయక్‌, గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బీక్యనాయక్‌, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, బాచిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి సుదర్శన్‌రెడ్డి, యాట నర్సింహ, కృష్ణయ్య, మహేశ్‌, వేణుగోపాల్‌, శేఖర్‌, శ్రీకాంత్‌, శివ, మల్లేశ్‌, కిరణ్‌, అశోక్‌, వంశీ, మోత్యనాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం వెల్జాలకు చెందిన కల్వకోలు వెంకటయ్య గురుస్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప పడిపూజ నిర్వవహించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌, మహేశ్‌, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

అయ్యప్పస్వాములకు మైనార్టీ నేత అన్నదానం

చేవెళ్ల: టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్‌ మాజీర్‌ మల్కాపూర్‌ గ్రామంలోని అయ్యప్పస్వాములకు ఆదివారం అన్నదానం ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సీహెచ్‌.వెంకటేశ్‌, స్వాములు ఉన్నారు.

ముగిసిన శబరిమలై పాదయాత్ర

కందుకూరు: కొత్తగూడకు చెందిన గురుస్వామి బొక్క సత్యనారాయణరెడ్డి, కత్తిస్వామి మునిశ్వర్‌రెడ్డిలు నెల రోజుల పాటు శబరిమలైకి పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకొని ఆదివారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాజరాజేశ్వరి ఆలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు ఎస్‌.శేఖర్‌గౌడ్‌, నాగేశ్వర్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, బాలకృష్ణగౌడ్‌, కేబీఎన్‌ చారి, రాజశేఖర్‌రెడ్డి, టి.మహే్‌షచారి, ప్రవీణ్‌రెడ్డి, ముత్యంరెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:07:14+05:30 IST