అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-03-17T04:55:22+05:30 IST

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి
మంత్రిని కలిసిన బాచుపల్లి గ్రామ మహిళలు

కందుకూరు , మార్చి 16: రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని బాచుపల్లి గ్రామానికి చెంది న మహిళలు మంత్రి సబితాఇంద్రారెడ్డిని కోరారు. బుధవారం నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఇదివరకే అధికారుల ద్వారా నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.సురేందర్‌రెడ్డి, మన్నె జయేందర్‌ముదిరాజ్‌, ఇ.బాలమల్లే్‌షయాదవ్‌ తాండ్ర దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more