ఉద్యోగాలు సాధించి కలలు సాకారం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-06T23:47:16+05:30 IST

యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నతంగా రాణించాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ, ఆనంద బుద్ధవిహార వ్యవస్థాపకులు సి. ఆంజనేయరెడ్డి పిలుపు నిచ్చారు.

ఉద్యోగాలు సాధించి కలలు సాకారం చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆంజనేయరెడ్డి

ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి

కడ్తాల్‌, డిసెంబరు 6: యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నతంగా రాణించాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ, ఆనంద బుద్ధవిహార వ్యవస్థాపకులు సి. ఆంజనేయరెడ్డి పిలుపు నిచ్చారు. సంకల్పం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో శ్రమించే వారు లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అన్మా్‌సపల్లి సమీపంలోని ‘ది ఎర్త్‌ సెంటర్‌’లో జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ ఫౌండేషన్‌, కౌన్సిలర్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సంస్థ ఆధ్వర్యంలో పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న 68మంది అభ్యర్థులకు ఇచ్చిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. సీజీఆర్‌ చైర్మన్‌ లీలాలక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆంజనేయరెడ్డి, జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌ అఖిలభారత కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి, సీఐ ఉపేందర్‌, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సతిమణి లక్ష్మమ్మ, ఫార్మా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ మన్మథరెడ్డి, శిఖర ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు ఎం.దిపీకారెడ్డి హాజరయ్యారు. ఫిజికల్‌ ఫిట్నె్‌సపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. లక్ష్య సాధనలో విశ్రమించవద్దన్నారు. ఎర్త్‌సెంటర్‌ డైరెక్టర్‌ సాయిభాస్కర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్‌ రజనీకాంత్‌, ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ శంకర్‌, సీజీఆర్‌ సభ్యులు ఉమామహేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్‌, వంశీ, కోటేశ్‌, శ్రీకాంత్‌, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:47:17+05:30 IST