ఘనంగా గణేశ్‌ నిమజ్జనాలు

ABN , First Publish Date - 2022-09-12T05:05:49+05:30 IST

ఘనంగా గణేశ్‌ నిమజ్జనాలు

ఘనంగా గణేశ్‌ నిమజ్జనాలు
యాచారం మండలం నల్లవెల్లిలో నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు

కేశంపేట/షాబాద్‌/చేవెళ్ల/కడ్తాల్‌/తలకొండపల్లి/చౌదరిగూడ/కందుకూరు/మహేశ్వరం/యాచారం, సెప్టెంబరు 11: కేశంపేట మండలం చింతకుంటపల్లిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనానికి తరలించారు. అంతకు ముందు లడ్డూ వేలంలో రూ.60వేలకు సర్పంచ్‌ పోచమోని పార్వతమ్మ జంగయ్యదక్కించుకున్నారు. అలాగే కేశంపేటలో బాలగణపతి యూత్‌ ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. షాబాద్‌ మండలంలో గణనాఽథులకు ప్రజలు, పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. మల్లారెడ్డిగూడలో లడ్డును మీసాల వెంకటయ్య రూ.1.51లక్షలకు దక్కించుకున్నారు. పండ్లను అమీర్‌పేట్‌ గోవర్దన్‌రెడ్డి రూ.35వేలకు దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు శేఖర్‌గౌడ్‌, సత్యనారాయణ, జంగయ్య, గణే్‌షగౌడ్‌, శ్రీనివాస్‌, అంజనేయులు, నర్సింహులు, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, రాఘవరెడ్డి, రాజలింగం, రాజేందర్‌, విక్రంరెడ్డి, రాజు, సంజీవ, సత్యనారాయణ, జంగయ్య పాల్గొన్నారు. చేవెళ్ల మండలం రావులపల్లిలో వినాయకుడి లడ్డూను ప్యాక్స్‌ డైరెక్టర్‌ కె.నరేందర్‌యాదవ్‌ రూ.2.11లక్షలకు సొంతం చేసుకున్నారు. కడ్తాల శివాలయం కాలనీలో  బ్రహ్మంగారి ఉత్సవ కమిటీ మండపం వద్ద మాదారం మ హేశ్వర్‌గౌడ్‌ నిర్వహించిన పూజల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పరమేశ్‌, ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం రాంపూర్‌లో నిర్వహించిన పూజల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌, నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యు లు పాల్గొన్నారు. షాద్‌నగర్‌లోని కట్టమైసమ్మ ఆలయం వద్ద నెలకొల్పిన వినాయకుడి వద్ద అన్నదానం నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌యాదవ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి ప్రవీణ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవియాదవ్‌, రమేష్‌, బిక్షపతి పాల్గొన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల గ్రామాల్లో గణపతుల నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. చౌదరిగూడలోని శివాజీ యూత్‌ సభ్యులు వినాయకుడి లడ్డూను వేలం వేశారు. కందుకూరు, మండలం అన్నోజిగూడలో వినాయక లడ్డూ రూ.80వేలు పలికింది. గణేష్‌ నిమజ్జనంలో సీఐ కృష్ణంరాజు పాల్గొన్నారు. యాచారం మండలం నల్లవెల్లి, గడ్డమల్లాయాగూడ తదితర గ్రా మాల్లో గణనాథులను నిమజ్జనం చేశారు.

Updated Date - 2022-09-12T05:05:49+05:30 IST