జాతీయస్థాయి స్కేటింగ్‌ పోటీలకు గడ్డమల్లాయగూడ బాలిక

ABN , First Publish Date - 2022-12-06T23:39:36+05:30 IST

అండర్‌-11 జాతీయ స్కేటింగ్‌ క్రీడా పోటీలకు గడ్డమల్లాయగూడకు చెందిన బాలిక గౌర అక్షర ఎంపికైంది.

జాతీయస్థాయి స్కేటింగ్‌ పోటీలకు గడ్డమల్లాయగూడ బాలిక
స్కేటింగ్‌ క్రీడాకారిణి అక్షర

యాచారం, డిసెంబరు 6: అండర్‌-11 జాతీయ స్కేటింగ్‌ క్రీడా పోటీలకు గడ్డమల్లాయగూడకు చెందిన బాలిక గౌర అక్షర ఎంపికైంది. జాతీయ స్థాయి స్కేటింగ్‌ పోటీలు ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు బెంగళూరులో జరుగుతాయి. ఈ పోటీలకు తెలంగాణ నుంచి అక్షర ఎంపికైంది. ఈ బాలిక జిల్లా స్థాయి పోటీల్లో ఇప్పటికే మూడు బంగారు పతకాలు సాధించింది. అక్షర మెజాతీయ స్థాయిలోనూ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నామని బాలిక తండ్రి మల్లేష్‌ అన్నారు.

Updated Date - 2022-12-06T23:39:38+05:30 IST