-
-
Home » Telangana » Rangareddy » Funds should be allocated for the development of the district-MRGS-Telangana
-
జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST
జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలి

- మంత్రి మల్లారెడ్డికి జడ్పీచైర్మన్ వినతి
ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబరు 10 : జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మంత్రి మల్లారెడ్డిని కోరారు. శనివారం నగరంలోని మంత్రి నివాసంలో శరత్‌చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మంత్రిని కలిసి జిల్లా అభివృద్ధి, పెండింగ్ పనులపై వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేషం, శామీర్‌పేట జడ్పీటీసీ అనిత, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్‌యాదవ్ పాల్గొన్నారు.