ఐనెల్లిలో స్త్రీనిధి డబ్బు స్వాహా

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

ఐనెల్లిలో స్త్రీనిధి డబ్బు స్వాహా

ఐనెల్లిలో స్త్రీనిధి డబ్బు స్వాహా

  • రూ.21.52లక్షలు సొంతానికి వాడుకున్నారని తేల్చిన ఆడిట్‌ బృందం
  • గ్రూప్‌ మహిళలతో మాట్లాడుతున్న సోషల్‌ ఆడిట్‌ బృందం

తాండూరు రూరల్‌, జూలై 3: డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళలు నెలనెలా  చెల్లించిన డబ్బును కొందరు స్వాహా చేస్తున్నారు. ఐనెల్లి గ్రామంలో 123 మంది స భ్యులున్న 22 సంఘాలకు రూ.35.12లక్షల రుణాలిచ్చారు. మహిళలు ప్రతినెలా చెల్లి ంచిన డబ్బులను ఐకేపీ ప్రతినిధి, సీసీ రాజేశ్వరి స్వాహా చేసినట్టు ఆడిట్‌ అధికారులు తేల్చారు. స్త్రీనిధి ఖాతాలు ఔట్‌స్టాండింగ్‌ చూపడం, ఖాతాలన్నీ ఎంపీఏ కావడంతో అధికారులు మూడు రోజులుగా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. రాష్ట్ర సెర్ప్‌ నుంచి సీఏఈఆర్‌పీ యాక లక్ష్మి ఆధ్వర్యంలో ఆడిట్‌ చేశారు. రుణాల లోన్‌ కార్డులు పరిశీలించి రికవరీ డబ్బు స్వాహా చేసినట్టు తేల్చారు. ఐకేపీ రీజినల్‌ మేనేజర్‌ వేణు, జిల్లా స్త్రీనిధి డీఎంజీ సురేందర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ మూడు రోజులు మకాం వేసి ప్రతీ స ంఘానికి ఇచ్చిన రుణం ఎంత? ఎంత చెల్లించారు? డబ్బు ఎవరు వాడుకున్నారు? అ నే దానిపై వివరాలు సేకరించారు. రూ.21.52లక్షలు స్వాహాచేసినట్టు నిర్ధారించారు. దీ నిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ తెలిపారు.


  • నిధుల దుర్వినియోగం వాస్తవమే : సంఘాల అధ్యక్షురాలు మొగులమ్మ

స్త్రీనిధి రుణాల దుర్వినియోగం వాస్తమేనని మహిళా సమాక్య అధ్యక్షురాలు మొగులమ్మ తెలిపారు. సభ్యులు తీసుకున్న రుణాలు ప్రతినెలా కట్టేందుకు తనకు ఇచ్చేవారని, ఆ డబ్బులు బ్యాంక్‌లో కట్టకుండా సీసీతో కలిసి ఇద్దరం తీసుకునేవారమని మొగులమ్మ చెప్పారు. ఈ విషయం బయటపడితే తాను చూసుకుంటానంటూ సీసీ చెప్పేవారన్నారు. ప్రతి సీసీ బ్యాంక్‌కు వెళ్లే సమయంలో కొంత డబ్బు వాడుకునేవారని ఆమె తెలిపారు. అన్ని గ్రామాల్లోనూ స్త్రీనిధి రుణాలపై విచారణ జరిపితే మరిన్ని అవకతవకలు బయటపడే ఆస్కారం ఉందని తెలుస్తోంది.


  • కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

తాండూరు మండల ఐకేపీలో రుణాల పంపిణీ, రికరీపై అధికారుల పర్యవేక్షణ లేకనే సీసీలు మహిళలు చెల్లించిన డబ్బును సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐకేపీ కార్యాలయంలో ప్రతీ వారం డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాల రికవరీపై సమావేశాలు నిర్వహించుకుంటారు. మండలంలో స్త్రీనిధి రుణాల రికవరీలలను ఏడుగురు సీసీలు, ఒక ఏపీఎం నిర్వహిస్తున్నారు. మండలంలో రూ.21లక్షలు స్వాహా అయితే ఐకేపీ ఏపీఎం, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌, సీసీలు ఏం చేస్తున్నారు? వారు సరిగా పర్యవేక్షిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more