బందోబస్తు మధ్య అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-09-12T05:11:31+05:30 IST

బందోబస్తు మధ్య అంత్యక్రియలు

బందోబస్తు మధ్య అంత్యక్రియలు
కుర్మిద్దలో మృతురాలు లత ఇంటి వద్ద గుమిగూడిన బంధువులు, గ్రామస్తులు

యాచారం, సెప్టెంబరు 11: మండల పరిధి కుర్మిద్దలో రెండు రోజుల క్రితం ఒంటిపై శానిటైజర్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న లత అంత్యక్రియలు ఆదివారం భారీ బందోబస్తు మధ్య జరిగాయి. లతకు వివాహ సమయంలో ఇచ్చిన కట్నకానుకలను తమకు తిరిగి ఇవ్వాలని లత పుట్టింటి వారు డిమాండ్‌ చేశారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. లత అత్తింటి వారి ఎకరం పొలాన్ని ఫార్మాసిటీ కోసం సేకరించారని, ఆ డబ్బు పూర్తిగా తమకు ఇవ్వాలని లత పుట్టింటివారు డిమాండ్‌ చేశారు. పుట్టింటి వారు, అత్తింటి వారిని సముదాయించేందుకు పోలీసులు తంటాలు పడ్డారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు వచ్చారు. లత పుట్టింటి వారి ఫిర్యాదు మేరకు ఆమె భర్త వెంకటే్‌షను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more