నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-04-25T05:17:36+05:30 IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ఆమనగల్లు, ఏప్రిల్‌ 24: ఎస్‌జేఆర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచితశిక్షణ ఇస్తున్నట్లు ఫౌండేషన్‌ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు మే 1న ఉదయం 10:30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కడ్తాల జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన 60మంది యువతీయువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రవేశపరీక్షకు ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల, కందుకూరు మండలాల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 8500033389, 8187017495 నెంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్‌ ప్రతినిధులు కృష్ణ, రజనీకాంత్‌ కోరారు. 

Read more