పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-11-16T23:59:31+05:30 IST

తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న అభ్యర్థులకు హ్యుమన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌, తెలంగాణ, ఏపీ చాప్టర్‌ ఆధ్వర్యంలో కోచింగ్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉచితంగా అందించనున్నారు.

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 16 : తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న అభ్యర్థులకు హ్యుమన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌, తెలంగాణ, ఏపీ చాప్టర్‌ ఆధ్వర్యంలో కోచింగ్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉచితంగా అందించనున్నారు. రిటైర్డ్‌ డీజీపీ సయ్యద్‌ అన్వర్‌ హుదా ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు హ్యుమన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎగ్బాల్‌ ఉస్సేన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద అభ్యర్థులకు చంద్రాయణగుట్టలోని పహాడిషరీఫ్‌ క్యూబా కాలనీలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 115 మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడం జరిగిందని, అందులో 54 మంది పోలీస్‌ కానిస్టేబుల్‌, 19 మంది ఎస్సై కోసం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉచిత శిక్షణ పొందాలనకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9100558075, 9985972530, 7207992740 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - 2022-11-16T23:59:33+05:30 IST