ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-09-12T05:17:02+05:30 IST

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలే సద్వినియోగం

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
తుమ్మలూరులో వైద్యపరీక్షలు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌

  • జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి

మహేశ్వరం, సెప్టెంబరు 11 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలే సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు నాణ్యమైన వైద్యపరీక్షలకు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని వారికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహద పడుతాయన్నారు. గ్రామంలో మొత్తం 400మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం అభినందనీయమన్నారు. పరీక్షలు చేయించుకున్న వారందరికీ ఉచితంగా తగిన మందులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మద్ది సురేఖకరుణాకర్‌రెడ్డి, ఫౌండేషన్‌ సీఈవో త్రిషారెడ్డి పాల్గొన్నారు. Read more