ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం

ABN , First Publish Date - 2022-09-12T05:19:27+05:30 IST

ఆమనగల్లు పట్టణంలో ఆదివారం నిర్వహించిన

ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం

ఆమనగల్లు, సెప్టెంబరు 11 : ఆమనగల్లు పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. శ్రీ సాయి ఆప్టికల్స్‌ ఐక్లీనిక్‌ ఆధ్వర్యంలో మక్కా కంటి ఆసుపత్రి సహకారంతో శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నేత్ర సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోహిజా, అబ్దుల్‌, రహెమాన్‌, సమ్రిన్‌, సిరీమ్‌, మల్లేశ్‌, కృష్ణనాయక్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more