అనారోగ్యంతో మాజీ సర్పంచ్‌ మృతి

ABN , First Publish Date - 2022-09-12T04:57:31+05:30 IST

అనారోగ్యంతో మాజీ సర్పంచ్‌ మృతి

అనారోగ్యంతో మాజీ సర్పంచ్‌ మృతి

నవాబుపేట, సెప్టెంబరు 11: మండల పరిధిలోని మాదారం గ్రామ మాజీ సర్పంచ్‌ రాంరెడ్డి(65) ఆదివారం మృతి చెందారు. గత కొంత కాలంగా పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సర్పంచ్‌ మృతి పట్ల చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. 

Read more