పశుగ్రాసం దగ్ధం

ABN , First Publish Date - 2022-12-06T23:48:09+05:30 IST

ప్రమాదవశాత్తు పశుగ్రాసం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలో జరిగింది.

పశుగ్రాసం దగ్ధం

దోమ, డిసెంబరు 6: ప్రమాదవశాత్తు పశుగ్రాసం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మున్నూర్‌ బసప్ప మంగళవారం తన బంధువుల గ్రామం పరిగి మండలం కాలాపూర్‌కు ట్రాక్టర్‌లో పశుగ్రాసాన్ని తరలిస్తుండగా దారిలో విద్యుత్‌ తీగలకు తగలడంతో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌, స్థానికులు ట్రాక్టర్‌లో ఉన్న గడ్డిని హుటాహుటిన కింద పడేశారు.

Updated Date - 2022-12-06T23:48:10+05:30 IST