పిస్తాహౌజ్‌కు ఫ్లైట్‌ స్టార్‌ హోటల్‌

ABN , First Publish Date - 2022-11-16T00:15:49+05:30 IST

శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తాలో గల పిస్తాహౌజ్‌కు మంగళవారం ‘ఫ్లైట్‌ స్టార్‌ హోటల్‌’ను తీసుకొచ్చారు.

పిస్తాహౌజ్‌కు ఫ్లైట్‌ స్టార్‌ హోటల్‌
అలియాబాద్‌ చౌరస్తాకు చేరిన ‘ఫ్లైట్‌ స్టార్‌ హోటల్‌’

శామీర్‌పేట, నవంబరు 15: శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తాలో గల పిస్తాహౌజ్‌కు మంగళవారం ‘ఫ్లైట్‌ స్టార్‌ హోటల్‌’ను తీసుకొచ్చారు. అలియాబాద్‌ చౌరస్తాలో ఇటీవల ప్రారంభించిన పిస్తాహౌజ్‌ యాజమాన్యం వినూత్న ఆకర్షణ కోసం ఫ్లైట్‌ మోడల్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు పాత విమానాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చింది. కేరళ రాష్ట్రం తివేండ్రంలో నిరుపయోగంగా ఉన్న పాత ఫ్లైట్‌ను కొని పిస్తాహౌజ్‌లో స్టార్‌ హోటల్‌గా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-11-16T00:15:49+05:30 IST

Read more