ఘనంగా జ్వాలాతోరణం

ABN , First Publish Date - 2022-11-07T22:46:21+05:30 IST

కార్తీక మాస పూజలు కీసరగుట్టలో వైభోవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీ మహన్యాపూర్వక రుద్రాభిషేకం, గంధాభిషేకం నిర్వహించారు. ఆనంతరం మహాలింగ దీపోత్సవం నిర్వహించారు. సాయంత్రం జరిగిన జ్వాలాతోరణం కన్నుల పండువగా జరిగింది.

ఘనంగా జ్వాలాతోరణం
కీసరగుట్టలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

కీసర/వికారాబాద్‌,నవంబరు,7: కార్తీక మాస పూజలు కీసరగుట్టలో వైభోవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీ మహన్యాపూర్వక రుద్రాభిషేకం, గంధాభిషేకం నిర్వహించారు. ఆనంతరం మహాలింగ దీపోత్సవం నిర్వహించారు. సాయంత్రం జరిగిన జ్వాలాతోరణం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యల్లో విచ్ఛేసి స్వామివారి దర్శించుకొని, అభిషేకాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయం వామ భాగంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కాగా జ్వాలాతోరణంలో భక్తులు పాల్గొని ఆలయ ద్వారం పైన గడ్డివామును వెలిగించి ప్రదక్షిణలు చేశారు. కార్తీకమాసోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్‌లోని అనంతగిరికి భక్తులు పొటెత్తారు. పద్మనాభస్వామి ఆలయ అవరణలో, బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో భక్తులు కార్తీ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

నేడు ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం కీసరగుట్ట ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్‌రెడి తెలిపారు. నుడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి, మహనివేదన సమర్పించి ద్వార బంధనం చేయడం జరుగుతుందని తెలిపారు. బుధవారం ఆలయ సంప్రోక్షణ ఆనంతరం భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శనం, అభిషేకాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఉమాపతి తెలిపారు.

Updated Date - 2022-11-07T22:46:21+05:30 IST

Read more