భార్య మృతికి కారకుడైన వ్యక్తికి ఐదేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-12-13T23:59:28+05:30 IST

భార్య ఉండగా వేరే మహిళతో వివాహేతర సం బంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారకుడైన భర్తకు ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిర మంగళవారం తీర్పు చెప్పారు.

భార్య మృతికి కారకుడైన వ్యక్తికి ఐదేళ్ల జైలు
బాల్‌రాజ్‌

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 13: భార్య ఉండగా వేరే మహిళతో వివాహేతర సం బంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారకుడైన భర్తకు ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిర మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. పోల్కంపల్లికి చెందిన కంభాలపల్లి బాల్‌రాజ్‌(40)కు మంచాల మండలం జాపాలకు చెందిన జంగమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు. బాల్‌రాజ్‌ మరో మహిళతో సంబంధంపెట్టుకొని అదనపు కట్నం కోసం జంగమ్మను వేధించాడు. బాధలు భరించలేక ఆమె 2015 అక్టోబరు 27న కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. జంగమ్మ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన ఎస్సైలు ఇఫ్తెకార్‌ అహ్మద్‌, కె.శంకర్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ పూర్తి అనంతరం జడ్జి ఈ తీర్పును వెలువరించారు.

Updated Date - 2022-12-13T23:59:28+05:30 IST

Read more